Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కాంగ్రెస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం తొలి మహిళా ప్రధాన మంత్రి, ఉక్కు మహిళగా పేరుగాంచిన ఇందిరాగాంధీ 104వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. ఇందిరా గాంధీని స్మరిస్తూ దేశానికి ఆమె అందించిన సేవలు, అభివద్ధి గురించి కొనియాడారు. కార్యక్రమంలో టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుగులోత్ కిషన్‌నాయక్, మండల అధ్యక్షుడు కంబాల ముసలయ్య, ఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రాము నాయక్, మండల ప్రదాన కార్యదర్శి గట్ల గణేష్, ఎంపీటీసీ లక్ష్మీ గణేష్, సీనియర్ నాయకులు తగిర సత్యనారాయణరెడ్డి, సొసైటీ డైరెక్టర్ గాడుదల కేతమల్లు, గ్రామ శాఖ అధ్యక్షులు కోడి శ్రీనివాస్, గుగులోత్ రవి, పవన్, యూత్ నాయకులు భూక్యా చంటి, పథ్వీరాజ్, లింగయ్య, యాదగిరి, ఆకునూరి సూర్యనారాయణ, రామగిరి వెంకటేశ్వర్లు, మోహన్, ప్రసాద్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.