Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హన్మకొండ
రైతు వ్యతిరేక నల్ల చట్టాల రద్దు కోసం రైతాంగం ఏడాదిగా సాగిస్తున్న చారిత్రాత్మక ఉద్యమం ఫలితంగా మోదీ ప్రభుత్వం వాటిని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిందని, ఇది రైతాంగ ఉద్యమ విజయమని సీపీఐ(ఎం) హనుమకొండ జిల్లా కార్యదర్శి సారంపెల్లి వాసుదేవరెడ్డి తెలిపారు. శుక్రవారం హన్మకొండ రాంనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఈ సందర్భంగా విజయోత్సవ సంబరాలను జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగ ఉద్యమం చారిత్రాత్మక మైందన్నారు. ఈ పోరాటంలో 750మంది రైతులు తమ ప్రాణాలను తణప్రాయంగా అర్పించారని తెలిపారు. దేశ ప్రజల్లో పెల్లుబికిన ఆగ్రహం, గత ఐదు రాష్ట్రాల ఎన్నికల పరాభవం, రాబోయే ఎన్నికల్లో ఓటమి సంకేతాల నుంచి తప్పించుకునేందుకు అనివార్యమైన స్థితిలో ప్రధాని మోదీ మూడు నల్ల చట్టాలను రద్దు చేసారన్నారు. వచ్చే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు ఆమోదించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ ప్రభాకర్ రెడ్డి, ఎం చుక్కయ్య, రాగుల రమేష్, జిల్లా కమిటీ సభ్యుడు గొడుగు వెంకట్, గుమ్మడిరాజుల రాములు, నాయకులు డీ భాను నాయక్, వేల్పుల సారంగపాణి, ప్రశాంత్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.
సీపీఐ(ఎం) నేతృత్వంలో సంబురాలు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
రైతు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ తన నిర్ణయాన్ని ప్రకటించడంతో సీపీఐ(ఎం) నేతృత్వంలో నగరంలో పలు ప్రాంతాల్లో శుక్రవారం సంబురాలు జరుపుకున్నారు. హన్మకొండ సౌత్ మండలం, వరంగల్ రంగశాయిపేట ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి హర్షం వ్యక్తం చేశారు. పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. రైతు చట్టాల రద్దు వల్ల రైతు కార్మికుల ఎర్రజెండా విజయం సాధించిందని సీపీఐ(ఎం) హన్మకొండ సౌత్ మండల కార్యదర్శి మంద సంపత్ అన్నారు. శుక్రవారం 31వ డివిజన్ మహాత్మా జ్యోతిరావు పూలేనగర్లో దూడపాక రాజేందర్ అధ్యక్షతన విజయోత్సవ సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మంద సంపత్ మాట్లాడుతూ రైతు చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని మోదీ ప్రకటించడాన్ని రైతులు, కార్మికులు చేసిన పోరాటానికి విజయంగా అభివర్ణించారు. కార్యక్రమంలో వేల్పుల సారంగపాణి, నోముల కిషోర్, మేకల రఘుపతి తదితరులు పాల్గొన్నారు.
బాణాసంచా కాల్చి సంబురాలు
సీపీఐ(ఎం) వరంగల్ రంగశాయిపేట ఏరియా కమిటీ కార్యదర్శి మాలోత్ సాగర్ నేతృత్వంలో నాయుడు పెట్రోల్ పంప్ జంక్షన్లో పార్టీ శ్రేణులు బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకున్నారు. పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. కార్య క్రమంలో సిపిఎం నాయకులు డి. సాంబమూర్తి, ఆనంద్‌సాగర్, మారక్క, లక్క రమేష్, జి. రాజే శ్వర్రావు, శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది చారిత్రాత్మక పోరాటం
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమించిన రైతాంగ పోరాటం చారిత్రాత్మకమైనదని ఎస్ఎఫ్ఐ హన్మకొండ జిల్లా కార్యదర్శి భాషబోయిన సంతోష్ తెలిపారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడంతో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ నేతృత్వంలో విద్యార్థులు బీమారంలో ర్యాలీ నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కె. రవితేజ పాల్గొన్నారు.
బీజేపీ మెడలు వంచిన రైతు పోరాటం
నవతెలంగాణ-పరకాల
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించడం రైతుల పోరా టానికి దిగివచ్చినట్లేనని సీపీఐ(ఎం) హన్మకొండ జిల్లా కమిటీ సభ్యులు దొగ్గెల తిరుపతి అన్నారు. శుక్రవారం పరకాల పట్టణంలో సీపీఐ(ఎం), ప్రజాసంఘాల ఆధ్వర్యంలో రైతు చట్టాల రద్దును హర్షిస్తూ బస్టాండ్ సెంటర్లో బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు మంద సురేష్, ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్, మండల అధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు మడికొండ వరుణ్, నాయకులు శివ, నరేష్, రాజు పాల్గొన్నారు.
నల్ల చట్టాలు రద్దు రైతుల గొప్ప విజయం
నవతెలంగాణ-నర్సంపేట
నల్ల చట్టాలు రద్దు రైతుల గొప్ప విజయమని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి చింతకింద రంగయ్య అన్నారు. కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం పట్ల సీపీఐ(ఎం) విజయోత్సవ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని వరంగల్ రోడ్డు కూడలిలో బాణసంచా కాల్చారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా యేడాది కాలంగా పోరాటం చేస్తుండగా చివరకు ప్రధాని మోడీ దిగొచ్చి రద్దు చేయక తప్పలేదన్నారు. రైతుల పోరాటాలకు మోడీ ప్రభుత్వం దిగివచ్చి చట్టాలను రద్దు చేయడమే కాకుండ దేశ ప్రజానీకానికి క్షమాపణ చెప్పడం రైతంగా పోరాట విజయ మన్నారు. ఇదే స్పూర్తితో ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకుండా, వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలోకి నెట్టేయకుండా రైతులు మరిన్ని బలమైన పోరాటాలకు సిద్దం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ సభ్యులు భూక్య సమ్మయ్య, కొరబోయిన కుమారస్వామి, నామిండ్ల స్వామి, హన్మకొండ శ్రీధర్, ఖానాపురం మండల కార్యదర్శి ముంజల సాయిలు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్, కే.శ్రీనివాసరెడ్డి, పెండ్యాల సారయ్య హెచ్ సంజీవ, సీఐటీయు నాయకురాలు గుజ్జుల ఉమా, సీపీఐ(ఎం), వ్యకాస నాయకులు పెంతల నరేష్, బుర్రి ఆంజనేయులు వివిధ గ్రామాలకు చెందిన సీపీఐ(ఎం) కార్యకర్తలు పాల్గొన్నారు.
నల్ల చట్టాలను రద్దు చేయడం పట్ల సీపీఐ ఆధ్వర్యంలో విజయోత్సవం నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో టపాసులు కాల్చి సంబురాలను జరుపుకున్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల రమేష్, నాయకులు అక్కపెల్లి రమేష్, గడ్డం యాకయ్య, ఇల్లందుల సాంబయ్య, బాల నర్సయ్య, మియాపురం గోవర్థన్, పాల కవిత తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-మట్టెవాడ
రైతాంగ ఉద్యమానికి మోడీ ప్రభుత్వం దిగివచ్చి రైతు వ్యతిరేక సాగు చట్టాలను రద్దు చేశారని, ఇదే స్ఫూర్తితో రైతులు పండించిన పంటకు మద్దతు ధర, రుణ విముక్తి చట్టాలు పార్లమెంట్లో చేసే వరకూ పోరాడాలని ఏఐకేఎస్ సీసీ జిల్లా కన్వీనర్ రమేష్ కన్వీనర్లు సోమిరెడ్డి శ్రీనివాస్, రాచర్ల బాలరాజు అన్నారు. నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని స్వాగతిస్తూ శుక్రవారం వరంగల్‌లోని పోస్ట్ ఆఫీస్ సెంటర్ వద్ద బాణాసంచా పెంచుతూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఉద్యమ విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కుమారస్వామి, బీరం రాములు, రాజేందర్, గడ్డం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక సాగు చట్టాల రద్దు ప్రజాస్వామ్య విజయమని ఎంసీపీఐ(యూ) రాష్ట్ర సహాయ కార్యదర్శి గాధగోని రవి అన్నారు. శుక్రవారం స్థానిక ఓంకార్ భవనంలో మంద రవి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి, ఏఐకేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి రమేష్, జిల్లా నాయకులు గంధం వెంకన్న, గడ్డం నాగార్జున పాల్గొన్నారు.
రైతు వ్యతిరేక నల్ల చట్టాలను మోడీ ప్రభుత్వం రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామని, ఇది రైతాంగ విజయమని ఏఐకేఎస్ జాతీయ కార్యదర్శి మోర్తల చందర్ రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
నవతెలంగాణ-ఎల్కతుర్తి
నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతులు సాధించిన గొప్ప విజయమని సీపీఐ వరంగల్ అర్బన్ జిల్లా సహాయ కార్యదర్శి బిక్షపతి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఏకేఎం యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మోతే లింగారెడ్డి, సీపీఐ మండల కార్యదర్శి ఊటూకూరి రాములు. సహాయ కార్యదర్శి కామెరా వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
నవ తెలంగాణ-నల్లబెల్లి
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తానని ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కడియాల మనోహర్ తెలిపారు. శుక్రవారం మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో వీరాచారి, రమేష్, లింగయ్య, సమ్మయ్య, రవి, క్రాంతి, నాగేశ్వరరావు, కుమార్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-సంగెం
మూడు రైతు చట్టాలను వెనుకకు తీసుకుంటున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నట్టు తెలంగాణ రైతు సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్ తెలిపారు. శుక్రవారం పల్లారుగూడలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ఆ సంఘం ప్రధాన కార్యదర్శి రాజయ్య, హంసల్ రెడ్డి, కొమురయ్య,కత్తి సుధాకర్ పాల్గొన్నారు.
నవతెలంగాణ-కాశిబుగ్గ
రైతాంగ పోరాటాల ఫలితంగానే సాగు చట్టాల రద్దు ప్రకటన వెలువడిందని తెలంగాణ రైతు సంఘం వరంగల్ ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు భాషిపాక రమేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్నారు. చట్టాలను రద్దు చేయాలని చేస్తున్న పోరాటంలో ఎంతో మంది అమరుల య్యారని, వారి త్యాగ ఫలితమే ఈ చట్టాల రద్దు అని పేర్కొన్నారు.
నవతెలంగాణ-దుగ్గొండి
కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటామని ప్రకటిం చడం రైతులు సాధించిన గొప్ప విజయమని సీపీఐ(ఎం) జిల్లా నాయకుడు ఈ సం పల్లి బాబు తెలిపారు. శుక్రవారం గిర్నిబావిలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు చల్ల నరసింహరెడ్డి, చెల్పూరి మొగిలి, వేములపల్లి ఓదెలు, బత్తిని స్వామి, కోడం రమేష్, కొంగర నరసింహ స్వామి, కుమారస్వామి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-జఫర్గడ్
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతాంగం ఏడాది పాటు కొనసాగించిన రైతాంగ ఉద్యమం ఫలితమె సాగు చట్టాల రద్దని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకుకనకారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని శతమ్మడపల్లి జి గ్రామంలో రైతు చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడాన్ని హర్షం వ్యక్తం చేస్తూ సీట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు. తెలంగాణ రైతు సంఘం జనగామ జిల్లా అధ్యక్షుడు రాపర్తి సోమయ్య. జీ రాజు, ఎన్ని యాకయ్య, వీ మల్లయ్య, వీ రవి, శంషాద్దీన్, రోజా తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-బచ్చన్నపేట
పోరాటాలతో సమస్యలు పరిష్కారమ అవుతాయనడానికి నిదర్శనమే మూడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడమని రైతుసంఘం జనగామ జిల్లా సహాయ కార్యదర్శి గొల్లపల్లి బాపురెడ్డి అన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో చెప్పాల నర్సింహులు, బండరాజు, ఎనుగుల పరమేశ్, అంజనేయులు, ఎల్లయ్య, వెంకటేష్, రామ్ రెడ్డి, బాల్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నిరంకుశ పాలనపై రైతుల విజయం
నవతెలంగాణ-పాలకుర్తి
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించడం బీజేపీ నిరంకుశ పాలనపై రైతులు సాధించిన విజయమని, రైతుల పోరాటానికి కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చినట్లేనని రైతు సంఘాల జిల్లా నాయకులు మాచర్ల సారయ్య, మామిండ్ల రమేష్ రాజా అన్నారు. శుక్రవారం రాజీవ్ గాంధీ చౌరస్తాలో వ్యవసాయ చట్టాల రద్దుపై రైతు సంఘాలు చేస్తున్న పోరాట విజయంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు సోమ సత్యం, చిట్యాల సోమన్న, మాన్యపు బుజెందర్, జీడి సోమయ్య, ముస్కు ఇంద్రా రెడ్డి, ఓగ్గుల లక్ష్మణ్, తూర్పాటి సారయ్య, జి కార్తీక చారి, ఏం రాజు, ప్రసాద్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
నవతెలంగాణ-జనగామ
స్థానిక అంబేద్కర్ చౌరస్తా, రైల్వే స్టేషన్ ఆవరణలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రైతు వ్యతిరేక నల్ల చట్టాల ఉపసంహరణ నిర్ణయాన్ని హర్షిస్తూ ప్రజా సంఘాల నాయకులతో కలిసి విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకా రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటనను స్వాగతిస్తున్నట్లు తెలిపారు. బీజేపీ అనుసరించే కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా రైతాంగం చేసిన పోరాటంగా చరిత్రలో మిగిలి పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త ఎండీ సాధిక్ అలీ, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎదనూరి వెంకట్రాజ్యం, కేజీకేఎస్ రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు, ప్రజనాట్య మండలి రాష్ట్ర ఉపాధ్యక్షుడు యదగిరి, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య పాల్గొన్నారు.
వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడం రైతులు సాధించిన విజయంగా భావిస్తున్నామని టీఎస్‌యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు కానుగంటి రంజిత్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఆకుల శ్రీనివాసరావులు తెలిపారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు పీ చంద్రశేఖర్ రావు, కోశాధికారి వెంకటేశ్వర రావు, జిల్లా కార్యదర్శులు మదూరి వెంకటేష్, శ్రీహరి, వనం నర్సింహులు, శ్రీనివాస్, నాగరాజు, శ్రీనివాస్, కష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు
నవతెలంగాణ - స్టేషన్ ఘన్ పూర్
కేంద్రం వ్యవసాయ నల్ల చట్టాలను వెనక్కి తీసుకోవడంతో అమరుల త్యాగానికి సార్థకత కలిగిందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏదునూరి వెంకట్రాజం అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఏన్నకుస కుమార్(ఎంపీటీసీ) ఘన్పూర్ ఏరియా కార్యదర్శి మునిగెల రమేష్, తదితరులు పాల్గొన్నారు.