Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాజీపేట
విజయవాడకు తరలించిన క్రూలింకులు కాజీపేటకు తిరిగి తీసుకువచ్చే వరకూ పోరాటాలు నిర్వహిస్తామని తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘవేందర్ అన్నారు. శుక్రవారం సీనియర్ సెక్షన్ ఇంజినీ రింగ్ నార్త్ కార్యాలయం ఎదుట క్రూలింకులు కాజీపేటకు తీసుకురావాలనే డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇంజనీరింగ్ విభాగంలోని రైల్వే ట్రాక్‌మెన్ సోదరీ-సోదరమణులు రాబోయే రోజుల్లో నిరసన కార్యక్రమాలను ఉదృతం చేసేందుకు మద్దతు కోరగా, సంపూర్ణ మద్దతు ప్రకటించినట్టు పేర్కొన్నారు. క్రూలింకులను రైల్వే అధికారులు కాజీపేటకు తిరిగి తీసుకురావాలని, లేని పక్షంలో ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైల్వే జేఏసీ, లోకో రన్నింగ్ స్టాఫ్ జేఏసీ, ఇంజనీరింగ్ విభాగాల కార్మికులు కొండ్ నర్సింగారావు, సాయికుమార్, చింతా మురళి, రేండ్ల రమేష్, రాజు,భాస్కర్, ప్రవీణ్, యాకూబ్ పాషా, సంగమయ్య తదితరులు పాల్గొన్నారు.