Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రీజనల్ జాయింట్ కమిషనర్ సునీత
నవతెలంగాణ-కాశిబుగ్గ
అసంఘటిత రంగ కార్మికులు ఈ - శ్రమ్ పోర్టల్ లో తమ వివరాలను నమోదు చేసుకొని ప్రభుత్వం కల్పిస్తున్న వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందాలని రీజనల్ జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ జీ సునీత పిలుపునిచ్చారు. చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ కార్యాలయంలో అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన అసంఘటిత కార్మిక అవగాహన సదస్సుకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కూలీలు, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం అన్ని విధాల తోడ్పడుతుందన్నారు. చాంబర్ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి మాట్లాడుతూ..కోవిడ్-19తో ఎక్కువగా అసంఘటిత రంగ కార్మికులు, వలస కూలీలు మొదలగు పేద కార్మిక వర్గాలే ప్రభావి తమయ్యారని వాపోయారు. కార్మికుల సంక్షే మానికి చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ పాటుపడుతుందని హామీ ఇచ్చారు. సాగు చట్టాల రద్దును స్వాగతిస్తున్నట్టు పేర్కొన్నారు. అనంతరం జాయింట్ కమిషనర్ సునీత, అసిస్టెంట్ కమిషనర్ ప్రసాద్, ఇతర కార్మిక శాఖ అధికారులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు ఇనుముల మల్లేశం, గంగారపు రమేష్ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు మడూరి వేద ప్రకాష్, కైలాస హరినాథ్, సుధాటి రాజేశ్వరరావు, భూపతి ప్రభాకర్, యుగేందర్ పాల్గొన్నారు.