Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వర్ధన్నపేట
గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ గుజ్జ సంపత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కట్య్రాల గ్రామంలో వెన్నెల తెలంగాణ గ్రామ సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. 17శాతం లోపే తేమ ఉంటేనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు చెన్న సమ్మక్క, గ్రామైక్య సంఘం అధ్యక్షురాలు ఉపేంద్ర, లక్ష్మి, గోపమ్మ, వీఓ ఏలు మంజుల, స్వప్న, రజిత, వార్డ్ మెంబర్లు రాజు మహేందర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.