Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హసన్‌పర్తి
నేరాన్ని కప్పి పుచ్చేందుకు ప్రయత్నించడం కూడా నేరమేనని హన్మకొండ ఏసీపీ జితేందర్ రెడ్డి అన్నారు. మండలంలోని కేయూ పోలీసు పోలీసు స్టేషన్ పరిధి భీమారంలో ప్రకాశం జిల్లాకు చెందిన మేస్త్రి నల్లపు లక్ష్మారెడ్డిని బండరాయితో హత్య చేసిన నిందితుడితో పాటు అందుకు సహకరించిన మరో ఇద్దరు నిందితుల అరెస్టును వివరాలను శుక్రవారం ఆయన వెల్లడించారు. వివరాల్లోకి వెళితే... లక్ష్మారెడ్డి మేస్త్రీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ నెల 15వ తేదీన లక్ష్మారెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాయితో మోది హత్య చేశారు. ఘటనపై కేయూ ఇన్స్పెక్టర్ జనార్దన్‌రెడ్డి విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే హత్య చేసిన నిందుతుడు కొడారి సందీప్‌తో పాటు అందుకు సహకరించిన బేతిలి అంకూస్, సంగాల ప్రణీత్‌లను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ జితెందర్‌రెడ్డి వెల్లడించారు. హత్య చేసిన వారే కాకుండా హత్యకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన వారు కూడా చట్టం దృష్టిలో నేరస్తులుగానే పరిగణించబడుతారని ఏసీపీ పేర్కొన్నారు. హత్య కేసులో మిస్టరీని చేధించిన కేయూ ఇన్స్పెక్టర్ జనార్ధన్‌రెడ్డితో పాటు పోలీసు సిబ్బందిని సీపీ తరుణ్‌జోషి అభినందించారు.