Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
గ్రామాభివద్ధికి పాటు పడాల్సిన సర్పంచ్లు అధికారుల అండదండలతో నామమాత్రపు పనులు చేస్తూ, లక్షల బిల్లులు డ్రా చేస్తూ పంచాయతీ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు. లక్షల్లో బిల్లులు డ్రా అవుతున్న గ్రామంలో జరిగిన అభివద్ధి మాత్రం శూన్యమని గామస్తులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.
శాయంపేట గ్రామపంచాయతీ కార్యాల యానికి స్టేట్ఫైనాన్స్, సెంట్రల్ ఫైనాన్స్ నిధులు మంజూరయ్యాయి. మందారిపేట నుంచి శాయంపేట, పత్తిపాక వరకు ఆర్అండ్ బీ రోడ్డు మరమ్మతుల పేరుతో 2020 నవంబర్ 5న 83,522, 83,522, 82,815, 83,421 రూపాయలు నాలుగు చెక్కులు మొత్తంగా 3లక్షల 33వేల 280 రూపాలయను ఎస్ఎఫ్˜సీజీ నిధుల నుంచి డ్రా చేశారు. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా బీటీ రోడ్డు ప్రక్కన పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపునకు జంగల్ కటింగ్ పేరుతో ఈ ఏడాది జనవరి 21న 96 వేలు, జేసీబీ పనులకు సీఎఫ్సీజీ నిధుల నుంచి లక్షా 34వేలు, ఇదే రోడ్డు మరమ్మత్తులకు నవంబర్ 5న 83,552, 22,488 లను సీఎఫ్సీజీ నిధుల నుంచి డబ్బులు డ్రా చేశారు. రోడ్డుపై ఏర్పడిన గుంతలలో మట్టి, డస్టు పోసి గుంతలను పూర్తి వేసి నామమాత్రపు పనులు చేసి 2019 నుంచి 2021 వరకు ఆర్ అండ్ బీ రోడ్డు మరమ్మతుల పేరుతో 7లక్షల 52 వేల 292 నిధులను డ్రా చేశారు.
4బావుల పూడ్చివేతకు 6 లక్షల 67 వేలు..
పల్లెప్రగతిలో నిరుపయోగమైన పాడుబడిన బావులను పూడ్చి వేయాలని అధికారులు ఆదేశించారు. దీన్ని ఆసరా చేసుకున్న సర్పంచ్ పల్లె ప్రకతి వనం ఏర్పాటు కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో తొలగించిన మట్టిని 4పాత బావులలో నింపి పూడ్చేశారు. గ్రామంలోని రచ్చ సాంబయ్య బావి పూడ్చడానికి స్టేట్ ఫైనాన్స్ నిధుల నుంచి గతేడాది నవంబర్ 7న 72,225, 1,41,601రూపాయల నిధులు డ్రా చేశారు. కోల మల్లయ్య బావి పూడ్చడానికి ఈ ఏడాది సెప్టెంబర్ 4న 1,75,499, అదే ప్రాంతంలో మైలగాని సాయిలు బావి పూడ్చివేత కు 1,75,280, మారెపల్లి ఎల్లయ్య బావి పూడ్చివేత కు 1,75,812 రూపాయల నిధులను డ్రా చేశారు. పాత బావులను మొరంతో నింపినా కూడా లక్షల్లో ఖర్చు రాదని, ప్రభుత్వ స్థలంలోని మట్టిని తీసి బావ్లులు నింపి లక్షణంగా లక్షలు కాజేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి విచారణ చేపట్టి ప్రభుత్వ ధనం వథా కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు. నిధులు దుర్వినియోగం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.