Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సంగెం
సంగెం పోలీసుల పనితీరు బాగుందని, ప్రజలకు దగ్గర కావడానికి వారు చేసే పనితీరు బాగుందని మామునూర్ ఏసీపీ ఏ నరేష్ కుమార్ అన్నారు. శుక్రవారం సంగెం పోలీస్ స్టేషన్ ను ఆయన తనిఖీ చేశారు. ఎస్సై భాస్కర్ రెడ్డి తన సిబ్బందితో పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పరేడ్ నిర్వహించగా ఆయన పలు సూచనలు చేశారు. పోలీస్ స్టేషన్ లోపల మరియు బయట పచ్చదనం, పరిశుభ్రత, 5ఎస్ అమలవుతున్న తీరును పరిశీలించారు. పోలీసు సిబ్బంది యొక్క కిట్ ఇన్స్పెక్షన్ చేసి వారికి పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయా, అదే విధముగా సిబ్బంది ఆరోగ్య పరీక్షలు సకాలములో చేయించుకుంటున్నారా లేదోనని పరిశీలించారు. పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల వివరాలు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. రికార్డులను పరిశీలించి అట్టి రికార్డులను పోలీసు మాన్వల్కు అనుగుణంగా రాయాలని సూచించినారు. అభివద్ధిచెందిన టెక్నాలజీతో పోలీసు శాఖ కేసుల పరిశోధన, నేరస్తుల పైన నిఘా, నేరాలు జరగకుండా నియంత్రణ, నేరస్తుల పైన కోర్టులో నేరనిరూపణకు ఉపయోగించుకుంటున్న తీరును పరిశీలించారు. పోలీసు సిబ్బంది పనితీరు, ప్రజా సంబంధాలు, మెరుగుపరచడానికి తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు. కమ్యూనిటీ పోలీసింగ్, రోడ్డు భద్రత చర్యలు, యువతకు సన్మార్గములో నడిపించడానికి తీసుకోవాల్సిన చర్యలపైన అవగాహన కల్పించారు. పోలీస్స్టేషన్ సిబ్బంది, ఎస్సై భాస్కర్ రెడ్డి పనితీరు బాగుందని కొనియాడారు. ప్రజలకు ఇంకా చేరువ కావాలని, ప్రజల మన్ననలను పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పర్వతగిరి సీఐ విశ్వేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.