Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
బాల్య దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకోవాలని చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ వీరబాబు అన్నారు. చైల్‌లైన్ సే దోస్తీ వారోత్సవాలలో శుక్రవారం పట్టణంలోని విజ్డమ్ హైస్కూల్లో సతీష్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బాలలు చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, క్రమ శిక్షణతో చదువుకోవాలన్నారు. ఇతర పనులకు వెళ్లకుండా చదు వుల్లో ప్రతిభ కనపర్పి జీవితంలో స్థిరపడాలని సూచించారు. బాల్య వివాహాలను నిరాకరించాలన్నారు. బాలల హక్కులను పరిరక్షించేందుకు చైల్డ్‌లైన్ నిరంతరం సేవలందిస్తుందని, తగు సాయం కోసం 1098 లేదా 100కు ఫోన్ చేయాలన్నారు. చైల్డ్ లైన్ పోస్టర్లను ఆవిష్కరించి ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ ఎస్డీ.జావేద్, వైస్ ప్రిన్సిపాల్ ప్రకాష్, చైల్డ్ లైన్ టీం మెంబర్స్ నాగరాజు, హరీష్ , ప్రతిభ స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు వెంకటస్వామి, వీరభద్రయ్య, రియాజ్, రఘుపతి రెడ్డి, సుకన్య, హారిక, మంజుల పాల్గొన్నారు.