Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బయ్యారం
కాంగ్రెస్ పార్టీ మండల ప్రచార కార్యదర్శి, ఎంపీటీసీ బానోత్ మోహన్‌జీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని ఇందిరా గాంధీ 104వ జన్మదినం వేడుకలను శుక్రవారం నిర్వ హించారు. మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళ్లర్పించారు. అనం తరం మోహన్ జీ మాట్లాడారు. భారతదేశ ఉక్కు మహిళ భారతరత్న భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ గరీబీ హటావో నినాదంతో దేశంలో పేదరికాన్ని రూపురేఖలు మార్చారని కొనియాడారు. బ్యాంకులు జాతీయీకరించారని, అనేక పథకాలు తీసు కొచ్చారని గుర్తు చేశారు. కార్యక్రమంలో సీనియర్ నాయ కులు కొవ్వూరు దామోదర్‌రెడ్డి, సొసైటీ డైరెక్టర్ జూలకంటి సీతారాంరెడ్డి, తమ్మిశెట్టి రామదాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు భానోత్ నాగరాజు, వెంకట్‌రెడ్డి, గంగావత్ రవినాయక్, తమీరా ఉపేందర్‌రెడ్డి, భాను, రామ్ కోటి, వెంకన్న, భూక్య పంతులు, మందనపు వెంకన్న, నాగుల్ మీరా, సాగర్‌రెడ్డి, మేకల ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.