Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మంగపేట
పోడు సాగులో ఉన్న రైతులందరికీ హక్కు పత్రాలివ్వాలని ఎమ్మార్పీఎస్ మండల కన్వీనర్, ఎంఎస్పీ మండల ఇన్చార్జి సురేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలోని దళితవాడలోని దళిత పోడు రైతులను శుక్రవారం సురేష్ ఆధ్వర్యంలోని బృందం కలిసింది. ఈ సందర్భంగా సురేష్ మాట్లాడారు. జిల్లాలో వందలాది మంది భూమి లేని దళితులు ఉన్నారని, వారిని గుర్తించి ప్రభుత్వం మూడెకరాలు భూమి ఇవ్వాలన్నారు. మండలంలో గిరిజన, గిరిజనేతర సమస్య 15 ఏండ్లుగా కోర్టు వివాదంలో ఉండగా కొందరు అధికారులు ప్రభుత్వ ఆదేశాల సాకుతో 1/70 చట్టాన్ని బలవంతంగా అమలు చేయడానికి యత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిరుజనులతోపాటు దళితులు కూడా మండలంలో జీవిస్తున్నారనే విషయాన్ని ప్రభుత్వం, అధికారులు గుర్తుంచుకోవాలని సూచించారు. మండల కేంద్రంలో గోదావరి కోతతో దళితులకు చెందిన విలువైన మెట్ట భూములు గోదావరిలో కలిసి పోతున్న క్రమంలో ఆదుకునేలా చర్యలు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ ఏడాది వర్షాకాలంలో వచ్చిన వరదలకు పొదుమూర్ దళితుల ఆవాసాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉన్న క్రమంలో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారని, గోదావరితో ముప్పు ఉన్న నేపథ్యంలో పొద్మూరు వాసులకు ప్రభుత్వం మండలంలోని సురక్షిత ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టించాలని డిమాండ్ చేశారు. పొద్మూరు ప్రజల కష్టాలను మంత్రి సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ కవిత, ములుగు జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్లు స్వయంగా చూశారని చెప్పారు. 2015 నుండి ప్రజలు గోదావరి కోత భయంతో జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గోదావరి కోతకు గురికాకుండా కరకట్ట నిర్మించాలని డిమ్ాం చేశారు. కార్యక్రమంలో నాయకులు లంజపెళ్లి లాలయ్య, చిప్పనపెళ్లి రాములు, లంజపెల్లి లక్ష్మయ్య, ఆత్కూరి లాలమ్మ, మదనమ్మ, గంగమ్మ, లంజపెల్లి సమ్మక్క, లంజపెల్లి సమ్మయ్య, తదితరులు పాల్గొన్నారు.