Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కన్నాయిగూడెం
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అఫ్సర్ పాషా ఆధ్వర్యంలో శుక్రవారం పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర ్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మండల ఇన్ఛార్జి గుండ్ల దేవేందర్, జెడ్పీటీసీ నామా కరం చంద్ గాంధీ, వావిలాల ఎల్లయ్య హాజరయ్యారు. బూత్ కమిటీలను ఏర్పాటు చేశారు. పార్టీ కార్యకర్తలకు, కమిటీ సభ్యులకు సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పించారు. అనంతరం కరంచంద్ గాంధీ మాట్లాడారు. పార్టీని బలోపేతం చేయాలని కోరారు. కార్యకర్తలు సైనికుల్లా పని చేయా లని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు జాడి రాంబాబు, కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బు రమేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సునార్కాని రాంబాబు, బీసీ సెల్ మండల అధ్యక్షుడు కటకం మల్లయ్య, చంద్రయ్య, నాయకులు సాంబశివ, ప్రభాకర్, నర్సింగరావు, మాదాసు రాజేందర్, ముప్పనపల్లి ఉపసర్పంచ్ రాంబాబు, గ్రామ కమిటీ అధ్యక్షుడు మంచాల సత్యం, బుట్టయిగూడెం గ్రామ కమిటీ అధ్యక్షుడు సునార్కాని శ్రీరాములు, దాసరి నర్సింగ రావు, నారాయణ, సుమన్, తదితరులు పాల్గొన్నారు.