Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ములుగు ఎమ్మెల్యే సీతక్క.
నవతెలంగాణ-గోవిందరావుపేట
వీరపనేని శివాజీ మండలానికి చేసిన సేవలు చిరస్మరణీయమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. ఆదివారం స్థానిక తారకరామ కాలనీలో సర్పంచ్ బుఖ్య లక్ష్మి జోగా నాయక్ అధ్యక్షతన ఐదు వందల కుటుంబాలకు శివాజీ 74వ జయంతి సందర్భంగా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. దివంగత సీఎం ఎన్టీర్ హాయంలో ఒకే విడతలో మండలానికి 4వందల ఇండ్లు మంజూరు చేయించిన ఘనత శివాజీకే దక్కిందాన్నరు. అలనాటి ఆ 400 గహాల సముదాయాన్నే నేడు తారకరామ కాలనీగా పిలుస్తున్నట్టు చెప్పారు. అంతేకాక రెవెన్యూ గ్రామంగా కూడా గుర్తించలేని గోవిందరావుపేట గ్రామాన్ని మండలంగా ఏర్పాటు చేయడంలో ఆయన కృషి ఎనలేనిదన్నారు. దివంగత సీఎం ఎన్టీఆర్ మూడు సార్లు మండలాన్ని సందర్శించినట్టు తెలిపారు. ఈ విషయంతో ఎన్టీఆర్తో శివాజీకి ఉన్న ఆత్మీయ స్నేహ బంధానికి నిదర్శమన్నారు. మొదటి నుంచి వారి కుటుంబం పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం వారి పెద్దల పేరుమీద ప్రయాణ ప్రాంగణం నిర్మించినట్టు చెప్పారు. నాటి నుండి నేటి వరకు వారు, వారి కుటుంబ సభ్యులు పేద ప్రజల అభివద్ధికి తోడ్పడుతున్నారని పేర్కొన్నారు. దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. వీరపనేని శివాజీ కుటుంబ సభ్యులు ముందు, ముందు మరిన్ని అభివద్ధి కార్యక్రమాలను నిర్వహించాలని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీ బంధువులు సూరపనేని నాగేశ్వరరావు, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నల్లెల కుమార స్వామి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్, కాంగ్రెస్ జిల్లా యూత్ అధ్యక్షుడు రామచందర్. ఎంపీటీసీలు ఆలూరి శ్రీనివాసరావు, గోపి దాసు ఏడుకొండలు, పీఏసీఎస్ డైరెక్టర్ జెట్టి సోమయ్య, వార్డు సభ్యులు తుమ్మల శివ తదితరులు పాల్గొన్నారు.