Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా నగరంలోని కాశిబుగ్గ ప్రాంతానికి చెందిన బేతి రాజు నియమితులయ్యారు. ఆదివారం కాశిబుగ్గలో జరిగిన బీసీ బహుజన సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజరు కుమార్ బేతీ రాజుకు నియామక ఉత్తర్వులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీల సమస్యల పరిష్కారానికి బేతీ రాజు చేస్తున్న కషిని గుర్తించి పదవి అప్పగించినట్టు తెలిపారు. బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాడుతూనే, రాజ్యాంగబద్ధంగా బీసీలకు రావాల్సిన హక్కుల సాధన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి ధర్మపురి రామారావు, జిల్లా మాజీ అధ్యక్షుడు గోగికార్ క్రాంతి కుమార్, వెలకంటి రాజ్ నంద, కోట సతీష్, బేతీ రమేష్, కూచన క్రాంతి, భాషబోయిన వేణు, తదితరులు పాల్గొన్నారు.