Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -భువనగిరిరూరల్
రైతుల నుండి వడ్ల కొనుగోలు విషయంలో కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న మొండి వైఖరికి నిరసనగా ఈ నెల 22న కలెక్టరేట్ ఎదుట కర్షకుడా కదలిరా .. రైతు నిరసన దీక్షను కాంగ్రెస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి కోరారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ధాన్యం మార్కెట్ కు తీసుకొచ్చి రైతులు సుమారు నలభై రోజులు గడుస్తున్నా ఇంతవరకు కొనుగోలు సక్రమంగా జరగకపోవడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభానికి పరిమితమమాయన్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షకు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.