Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
నవతెలంగాణ -భువనగిరిరూరల్
ధరణి దరఖాస్తులను పెండింగ్ లేకుండా వెంటనే క్లియర్ చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. ఆదివారం కలెక్టర్ జూమ్ మీటింగ్ ద్వారా జిల్లా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ డి.శ్రీనివాస్ రెడ్డితో కలిసి ధరణి దరఖాస్తుల పై సమీక్ష నిర్వహించారు. ధరణిలో వచ్చిన దరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దరఖాస్తులను పరిష్కరించడంలో ఆర్డీవోలు, తహసీల్దారు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో రెవెన్యూ డివిజనల్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు.