Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పట్టించుకోని అధికారులు
నవతెలంగాణ-వేలేరు
మండల కేంద్రంలోని స్కూల్క్కాంపెక్స్ ఆవరణలోని మురికి కాలువతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఆవరణలో జెడ్పీహెచ్ఎస్, ఎంపీపీఎస్, కేజీబీవీ పాఠశాలలున్నాయి. మొత్తంగా ఈ పాఠశాలలలో 600మంది విద్యార్ధులు చదువుకుంటున్నారు. ఇదే ఆవరణలో ఎమ్మార్సీ కోసం నిర్మించిన భవనంలో ఎంపీడీఓ కార్యాలయం, గ్రామ నర్సరీ కూడా కొనసాగుతోంది.
ఈ ఆవరణ నుంచే గ్రామానికి చెందిన మురికి కాలువ పోతుంది. ఈ కాలువ పాటశాలలకు, శౌచాలయాలకు మద్యలో ఉంది. గత పదిహేను రోజులుగా కాలువ నిండిపోయి దుర్వాసన రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో వారు టాయిలెట్స్ ఉపయోగించలేని దుస్థితి ఏర్పడింది. మండల పంచాయతీ అధికారి ఇదే ఆవరణంలో విధులు నిర్వహిస్తున్న సమస్య పరిష్కారం కోసం పట్టించుకోకపోవడం గమనార్హం. అంతేకాకుండా ఇదే ప్రాంగణంలో ఎంపీడీఓ కార్యాలయం ఉండటంతో నిత్యం పంచాయతీ కార్యదర్శి, ప్రజా ప్రతినిధులు వస్తూ పోతూ ఉంటారు. అయినా వారు తమకేంటి అన్నట్టు వ్యవహరిస్తుండం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలల పరిశుభ్రత గ్రామపంచాయతీల బాధ్యత నే నిబంధనలు ఉన్నా కూడా బేఖాతరు చేస్తున్న అధికారుల తీరుపై విద్యార్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రజాప్రతినిధులు, అధికారులు పాఠశాల ఆవరణలోని మురికి కాలువను శుభ్రం చేయించడంతో పాటూ, కాలువపై శ్లాబ్ నిర్మించి ఇబ్బంది లేకుండా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.