Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏఐఎఫ్˜డీడబ్య్లూ జిల్లా కార్యదర్శి వంగల రాగసుధ
నవతెలంగాణ-నల్లబెల్లి
మహిళలపై రోజు, రోజుకూ పెరుగుతున్న హింసాత్మక ఘటనలకు, దాడులకు పాలకుల విధానాలే కారణమని ఏఐఎఫ్డీడబ్యూ జిల్లా కార్యదర్శి వంగల రాగసుధ అన్నారు. ఆదివారం స్థానిక మహిళా సమాఖ్య కార్యాలయంలో ఈ నెల 23 24 తేదీల్లో ఆదర్శ గ్రామం గంగదేవిపల్లి నిర్వహించే రాష్ట్రస్థాయి తరగతులను జయప్రదం చేయాలని కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ కోడూరి శోభ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. మత్తు పదార్థాలు వాడకంతో యువత విచక్షణ కోల్పోయి మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని వాపోయారు. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో కుటుంబాలను పోషించాల్సిన మహిళలు సరైన తిండి లేక రక్తహీనత, అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నారన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మహిళలు లోకాన్ని చైతన్యపరిచి ఐక్యంగా సమస్యలపై పోరాడే విధంగా ముందుకు సాగేందుకు మహిళా సంఘ కార్యకర్తల్లో అవగాహన పెంపొందించడానికి రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మహిళా సంఘ కార్యకర్తలు, మహిళా సంఘాల సభ్యులు, మహిళలు ప్రతినిధులు ఈ శిక్షణ తరగతులను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం మండల కార్యదర్శి మాట్లా సుధ, కలువల శైలజ, జమున, కవిత, కోమల, తదితరులు పాల్గొన్నారు.