Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు
కమిటీని నియమించాంటున్న గుత్తుదారులు
నవతెలంగాణ-పోచమ్మమైదాన్
వరంగల్ మహానగరపాలక సంస్థ పరిధిలో అభివద్ధి పనులు చేయాలంటే టెండర్లు వేయాలి. కానీ టెండర్ వేసేముందు కమిటీ నిర్ణయం తీసుకోవాలి. కానీ బల్దియాలో మాత్రం టెండర్ కమిటీ జాడే లేదు. బల్దియాలో ఏ అభివృద్ధి పనులు చేయాలన్నా టెండర్ కమిటీ ప్రత్యేక చొరవ తీసుకోవాలి. కానీ టెండర్ కమిటీ లేకపోవడంతో గుత్తేదారులు ఒకవేళ పనులు చేసినా బిల్లులు రావడం లేదు. దీంతో వారు అభివద్ధి పనులు చేయడంలో అనాసక్తి చూపడంతో పనులు అర్థాంతరంగా ఆగిపోస్తున్న దుస్థితి నెలకొంది.
కొన్ని పనులు చేయడానికి పలుమార్లు అధికారులు టెండర్లు పిలిచిన ఆ పనుల నిర్వహణకు గుత్తేదారులు ముందుకు రాకపోవడంతో చాలా వరకు టెండర్ రీకాల్ అవుతున్నాయి. అభివద్ధి పనులు సాఫీగా జరగడానికి ప్రత్యేకంగా టెండర్ కమిటీ ఉన్నట్టయితే ఆ పనుల కోసం టెండర్ నిర్వహించాలా.? వద్దా ? అనే నిర్ణయం తీసుకుంటుంది. కానీ ఆ కమిటీ లేకపోయేసరికి జనరల్ ఫండ్, పట్టణ ప్రగతి, స్మార్ట్సిటి తదితర పథకాలలో నిధులు ఉన్నాయో? లేదో చూసుకోకుండానే టెండర్లు పిలుస్తున్నారు. దీంతో బిల్లులు చెల్లింపులు జరగడం లేదని కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నగరపాలక సంస్థలో టెండర్ కమిటీని నియమిస్తే పనులు పూర్తయిన వెంటనే బిల్లులు సకాలంలో కాంట్రాక్టర్లకు చెల్లింపులు జరుగుతాయి. బల్దియాలో మాత్రం టెండర్కమిటీ అంటే ఏంటో తెలియనట్టుగా ఇంజినీరింగ్ అధికారులు వ్యవహరించడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ తరహాలో జీడబ్య్లూఎంసీలో టెండర్ కమిటీని నియమించాలని గుత్తేదారులు కోరుతున్నారు. గతంలో కమిషనర్ సర్ఫరాజ్, అనంతరం కమిషనర్ గౌతంలు టెండర్ కమిటీ పైన ప్రత్యేక దష్టి సారించారు. కానీ వారు బదిలీ అయిన వెంటనే టెండర్ల కమిటీ ఫైల్ కనుమరుగైందని పలువురు వాపోతున్నారు.
బల్దియా పరిధిలో ఏ పని చేయాలన్నా టెండర్ కమిటీ ఆధ్వర్యంలో టెండర్ నిర్వహించి ఎస్టాబ్లిష్మెంట్కు వెళ్లి ఆ తర్వాత కమిషనర్ ఆమోదించిన అనంతరం గుత్తేదారుకు వర్క్ ఆర్డర్ వస్తుంది. అలా జరగకపోవడం మూలంగా చేసిన పనులకు సకాలంలో బిల్లులు అందని దుస్థితి ఉందని, బల్దియా ఇంజినీర్లు ఇవేమీ పట్టించుకోవడం లేదు. టెండర్ కమిటీ నియామకం లేకుండా టెండర్ వేయడం వల్లనే బిల్లులు ఇవ్వడంలో జాప్యం జరుగుతుందని, మేయర్, కమిషనర్ స్పందించి టెండర్ కమిటీని నియమించాలని గుత్తేదారులు కోరుతున్నారు.