Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే రాజయ్య
నవతెలంగాణ-లింగాలఘణపురం
శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్న విద్యుత్ బిల్లుకు వ్యతిరేకంగా మరో పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్యే డాక్టర్ టి రాజయ్య కార్యకర్తలకు పిలుపు నిచ్చారు. ఆదివారం మండలం లోని సిరిపురం గ్రామంలో మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. రైతును రాజు చేసేందుకు సీఎం కేసీఆర్ కషి చేస్తున్నారన్నారు. రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలను రద్దు చేసి ప్రధాని మోడీ రైతులకు క్షమాపణ చెప్పడం అభినందనీయమని అన్నారు. నల్ల చట్టాల రద్దుకు చేసిన పోరాటంలో మృతిచెందిన ప్రతి రైతు కుటుంబానికి రూ.25లక్షల ఎక్స్ గ్రేషియో చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన రైతు కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3లక్షలు ఇస్తుందని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం పై అమీతుమీ తేల్చుకునేందుకు సీఎం కేసీఆర్ ఢిల్లీ పయణమయ్యారన్నారు. దేశానికి నేత గా కేసీఆర్, రాష్ట్రాకి నేతగా కేటీఆర్ ప్రజాసమస్యలపై పోరాటం చేస్తామన్నారు ఎంపీపీ చిట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి , జెడ్పీటీసీలు గుడి వంశీధర్ రెడ్డి ,రవి ,మండల ఇంచార్జి నాగేందర్ ,కురుమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంపత్, మార్కెట్ వైస్ చైర్మన్ ఆగారెడ్డి , జిల్లా దిశ కమిటీ సభ్యురాలు భాగ్యలక్ష్మి, యూత్ మండలం అధ్యక్షుడు శ్రీవారి, గంగధర్ ,విష్ణు, మండల నాయకులు భాస్కర్ రెడ్డి, ఉపేందర్, పాల్గొన్నారు.