Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకుర్తి
పాలకుర్తి గ్రామానికి చెందిన మేడారపు సుధాకర్ కాకతీయ యూనివర్సిటీ ప్రభుత్వ పాలన శాస్త్ర విభాగంలో కాకతీయ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్, విశ్వవిద్యాలయ పరీక్షల నియం త్రణాధికారి ఆచార్య పి మల్లారెడ్డి ద్వారా డాక్టరేట్ అందుకు న్నారు. హెల్త్ కేర్ పోగ్రామ్స్ ఇన్ తెలంగాణ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు కెసిఆర్ కిట్ ఎ స్టడీ అనే అంశం మీద పరిశోధనకు గాను డాక్టరేట్ ఆదివారం అందించారు. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన మేడారపు సుధాకర్ అనేక సామాజిక కార్యక్రమాలలో పాల్గొన్నారు, తెలంగాణ మలిదశ ఉద్యమంలో కేయూ విద్యార్థి నేత గా అనేక విద్యార్ది ఉద్యమాలు చేశారు, పాలకుర్తి నుండి డాక్టరేట్ పొందడం తమ ప్రాంతానికి గర్వకారణమని పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఓయూ నుంచి కేయూ వరకు పాదయాత్ర, ఢిల్లీలో ధర్నాలు, దీక్షలు, అసెంబ్లీ ముట్టడి, సాగర హారం వంటి అనేక ఉద్యమ కార్యక్రమాలలో కీలక భూమిక పోషించారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు శిష్యుడిగా టీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడుగా ఉన్నారు. సినిమా రంగంలో దాదాపు 16 చలన చిత్రాలకు ప్రొడక్షన్ మేనేజర్‌గా వ్యవహరించారు. ఆరు చలనచిత్రాలలో నటించారు. ఈ సందర్భంగా మేడారపు సుధాకర్ మాట్లాడుతూ ప్రభుత్వాల ఆరోగ్య సంక్షేమ కార్యక్రమాలపై పరిశోధన చేసినట్టు తెలిపారు. అనంతరం కుటుంబ సభ్యులు, మేధావులు, నాయకులు, విద్యార్థులు సుధాకర్‌ను సత్కరించి అభినందించారు.