Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గంగారం
గంగారం మండలంలోని తిరుమలగండి గ్రామానికి చెందిన ఆదివాసి ఆణిముత్యం తాటి కృష్ణవేణి క్రికెట్ క్రీడల్లో జాతీయస్థాయికి ఎంపికైంది. కానీ, గోవా, దుబాయిలో జరుగే పోటీలో పాల్గొనేందుకు ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. ఆదివారం విషయం తెలుసుకున్న ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ రూ.7వేలు ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు సువర్ణ పాక పాపారావు, జిల్లా అధ్యక్షులు పెనుక ప్రభాకర్ మాట్లాడుతూ.. ఏజెన్సీ మారుమూల గ్రామం నుండి జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్లో రంజీ ట్రోఫీలో' భారత మహిళల జట్టు లో స్థానం సంపాదించాలని ఆకాంక్షించారు. సర్పంచ్ ఈసం రామ సారయ్య, క్రీడాకారిని తల్లిదండ్రులు తాటి సమ్మయ్య పాపలక్ష్మి , కుంజ పుల్లయ్య లక్ష్మినరసింహ, కొమురం భీం యువజన సంఘం తాటి మహేష్, తాటి కష్ణారావు ,రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈసం సురేందర్ రావు , బద్రి, వెంకటేశ్వర్లు, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యనారాయణ పాల్గొన్నారు.