Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని తాళ్లపార్టీ తండా గ్రామ పంచాయతీకి చెందిన అజ్మీర రాకేష్ మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడని, చికిత్స నిమిత్తం 12 లక్షలు ఖర్చు అయ్యాయని, తమను ఆదుకోవాలని బాధిత కుటుంబం కోరింది. ఆదివారం ఎంపీ కవితను మహబూబాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో కలిసి వేడుకున్నారు. స్పందించిన ఎంపీ కవిత అధైర్య పడొద్దని, సీఎం రిలీఫ్ ఫండ్ అందేలా కృషి చేస్తానని , తమ వంతు సహాయం ఉంటుందని భరోసా ఇచ్చారు. టీఆర్ఎస్ నాయకులు పొన్నాల యుగంధర్ పాల్గొన్నారు.