Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సుబేదారి
ప్రభుత్వం అందించే రుణ లక్ష్యాలను బ్యాంకర్లు సకాలంలో సాధించాలని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు అధికారులను ఆదేశించారు. పంట రుణాలు, ఎస్‌హెచ్‌జీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ రుణాలతోపాటు ఆర్థిక అక్షరాస్యత, ఇతర అంశాలపై కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో డీసీసీ బ్యాంకర్ల త్రైమాసిక పురోగతిపై మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, పురోగతి, తదితర అంశాలను లీడ్ బ్యాంక్ మేనేజర్ వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ప్రజలు ఆర్థికంగా ఎదిగేలా బ్యాంకింగ్ రంగం సహకరిం చాలని సూచించారు. అభివద్ది కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు. రైతుల రుణ లక్ష్యాలు చేరుకోవడంలో మరింత పురోగతి సాధించాల్సి ఉందన్నారు. మహిళలు ఆర్థికంగా బలపడేలా ప్రభుత్వం అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎస్సీ కార్పొరేషన్లో పెండింగ్‌లో ఉన్న యూనిట్లను త్వరగా గ్రౌండింగ్ చేయాలని, ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేసిన లబ్దిదారులకు రుణాలు మంజూరు చేసేలా బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా బ్యాంకర్లు, కార్పొరేషన్ల అధికారులు సమర్ధవంతంగా పని చేయాలని సూచించారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులు, సిబ్బంది రుణ లక్ష్యాల అమలులో భాగస్వాములౌతున్న తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన మేరకు సూచనలు, సలహాలు అందించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చొరవ చూపాలని చెప్పారు. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ మురళీ మోహన్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శ్రీనివాస్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, ఎస్బీఐ ఆర్ఎం హరికష్ణ, ఆర్బీఐ ఎల్డీఓ సాయిచరణ్, నాబార్డ్ ఏజీఎం చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.