Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిన్నగూడూరు
మండల, గ్రామాల అభివద్ధి కోసం అధికారులు నిబద్ధతతో పని చేయాలని డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ కోరారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ వల్లూరి పద్మ వెంకట్రెడ్డి అధ్యక్షతన మంగళ వారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన రైతు బంధు, రైతు బీమా పథకాల సమాచా రాన్ని ప్రభుత్వానికి అందించాలని అగ్రికల్చర్ అధికారులను ఆదేశించారు. అలాగే మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీటిని ప్రతి ఇంటికీ అందించేలా మిషన్ భగీరథ అధికారులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పని చేయాలన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించేలా పంచాయతీ కార్యదర్శులు పర్యవేక్షించాలని చెప్పారు. కరోనా వ్యాక్సిన్ ఇంకా తీసుకొని వారిని గుర్తించి అవగాహన కల్పించి వ్యాక్సిన్ వేయాలని వైద్యాధికారిని, సీడీపీఓను, ఎంపీడీఓను, అధికారులను కోరారు. సమావేశంలో జెడ్పీటీసీ మూల సునీత, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ మంగపతిరావు, సీడీపీఓ శిరీష, ఎంపీడీఎ సరస్వతి, వైస్ ఎంపీపీ వీరయ్య, మండల కోఆప్షన్ సభ్యుడు మోసీన్ బేగ్, తదితరులు పాల్గొన్నారు.