Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ములుగు
అత్యాచారం క్షమించరాని నేరమని కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, ఎమ్మెల్యే సీతక్క స్పష్టం చేశారు. 'సమాజమా.. స్పందించుమా.. అత్యాచారం క్షమించరాని నేరం' అంటూ లిరిక్ రైటర్ మొగ్గం సుమన్ రచించిన పాట వాల్‌పోస్టర్‌ను సీతక్క చేతుల మీదుగా బహుజన సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు మారేపల్లి క్రాంతి కుమార్, తుడం క్రాంతి కుమార్, మండల అధ్యక్షుడు పెంబర్తి సురేష్, ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు పెంబర్తి భరత్ చంద్ర, మండల నాయకుడు దైనంపల్లి నాగరాజ్, మదర్ హ్యుమానిటీ యూత్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు వంగర ప్రవీణ్‌లతో కలిసి సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడారు. సమాజాన్ని చైతన్యవంతం చేసే కార్యక్రమాలు నిర్వహించడం, పాటలు రచించడం అవసరమని చెప్పారు. మారెపల్లి క్రాంతికుమార్, మొగ్గం సుమన్, తుడుం క్రాంతికుమార్‌లను అభినందించారు.