Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
నర్సంపేట డివిజన్వ్యాప్తంగా బస్సు సర్వీ సులను పునరుద్ధరించాలని ఎస్ఎఫ్ఐ వరంగల్ జిల్లా కార్యదర్శి యార ప్రశాంత్ డిమాండ్ చేశా రు. మంగళవారం ఆర్టీసీ బస్సు డిపో కార్యాల యంలో ఇన్చార్జికి వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. విద్యా సంస్థలు తెరిచి మూడు నెలలు గడిచినా ఆర్టీసీ అధికారులు అన్నీ గ్రామాల విద్యార్థులకు రవాణ సౌకర్యం కల్పించకపోవడం శోచనీమన్నారు. పేద విద్యార్థులు ప్రయివేటు వాహనాల్లో డబ్బులు ఖర్చు పెట్టి కళాశాలలకు, పాఠశాలలకు వచ్చేం దుకు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనేక మంది చదువులకు దూరమవ్వాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కొన్ని రూట్లలో నామ మాత్రంగా బస్సులు కొనసాగిస్తున్నా విద్యా సంస్థల సమయానుకూలంగా లేకుండా కేటా యించారని చెప్పారు. ఇప్పటివరకు అన్ని రూట్లలో బస్సులను పునరుద్దరించి విద్యార్థు లకు, సాధార ప్రయాణికులకు రవాణ సౌకర్యం కల్పించాలన్నారు. లేదంటే విద్యార్థులతో కలిసి డిపో ఎదుట ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభుయలు రాకేష్, శ్రీనివాస్, కృష్ణ, తరుణ్, నరేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.