Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గణపురం
దళితులకు ఇంటి స్థలాలు ఇచ్చేవరకు పోరాటం చేస్తామని అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షుడు పుల్లా ప్రేమ్‌సాగర్, మండల కన్వీనర్ శనిగరపు రాజేందర్ హెచ్చరించారు. మంగళవారం మండలంలోని అప్పయ్యపల్లె గ్రామంలో దళితులు చేస్తున్న భూపోరాటం తొమ్మిదో రోజుకు చేరుకుంది. వారికి సంఘీభావం తెలిపి రాజేందర్ మాట్లాడారు. 20 ఏండ్ల క్రితం దళితులకు ప్రభుత్వం భూమి కేటాయించిందని, కాలక్రమేనా అన్యాక్రాంతమెందన్నారు. ఆ భూమిని దళితులకు ఇవ్వాలన్నారు. దళితుల కోసం తాము భూ పోరాటంలో పాల్గొని భూమి సాధించుకునే వరకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో గడ్డం రమేష్, బుర్రి సురేష్, నరేష్, భద్రయ్య, తదితరులు పాల్గొన్నారు.