Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-జనగామ రూరల్
తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ జనగామ నియోజకవర్గ ఇన్చార్జి చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మాసాన్‌పల్లి లింగజి, మహిళ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు బడికె ఇందిర, జిల్లా నాయకులు ఉడత రవి యాదy డిమాండ్ చేశారు. మంగళవారం 'కళ్లాల్లో కాంగ్రెస్'లో భాగంగా జనగామ మండలం వడ్లకొండ గ్రామంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు కొన్నే మహేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ల ఫోరమ్ మండల అధ్యక్షులు గజే అనిల్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు పాల్గొని మాట్లాడారు. ప్రభుత్వల మొండి వైఖరి వల్ల పంటను కొనుగోలు చేపట్టకపోవడంతో నెల రోజులుగా రైతులు నానా తంటాలు పడుతున్నా రన్నారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసిపోయినా పట్టించుకో వట్లేద న్నారు. గన్నీ సంచులు కూడా అందుబాటులో లేవన్నారు. ఈ కార్యక్ర మంలో జనగామ పట్టణ అధ్యక్షులు ధర్మపురి శ్రీనివాస్, వడ్లకొండ గ్రామ శాఖ అధ్యక్షుడు గుండె ఐలయ్య, మాజీ ఎంపీటీసీ నామాల రవి జిల్లా నాయకులు బడికె కృష్ణస్వామి, కట్ట కృష్ణ, వార్డుమెంబర్ శ్రీనివాస్ యుగేందర్, మైనార్టీసెల్ మండల అధ్యక్షుడు యాసిన్ పాల్గొన్నారు.