Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్ళపల్లి
మండలవ్యాప్తంగా రేషన్ కార్డుదారులకు వచ్చే నెల డిసెంబర్ కోటా కింద సన్నబియ్యం అందించాలని సమాచార హక్కు చట్టం ప్రచార సమితి జిల్లా అధ్యక్షులు నిమ్మల భద్రయ్య కోరారు. మంగళవారం స్థానిక తహసీల్ధార్ సమ్మయ్యకు వినతిపత్రం అందజేసి ఆయన మాట్లాడారు. మూడు నెలలుగా పలు మండలాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారని, మొగుళ్ళ పల్లి మండలానికి మాత్రం పంపిణీ చేయడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి సన్నబియ్యం అందించాలని కోరారు. స.హ చట్టం ప్రచార సమితి నియోజకవర్గ అధ్యక్షులు మంగలపల్లి శ్రీనివాస్, మండల అధ్యక్షుడు ప్రభాకర్, రామస్వామి, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు