Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి
నవతెలంగాణ-లింగాలఘణపురం
జనగామ జిల్లాకు చాకలి ఐలమ్మ జిల్లాగా నామకరణం చేయాలని తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి డిమాండ్ చేసింది. మంగళవారం మండల కేంద్రంలో మండల అధ్యక్షులు దీకొండ రాజు అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు గోపి, జిల్లా అధ్యక్షులు సాంబరాజు రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏదు నూరి వీరన్న, మండల అధ్యక్షులు దీకొండ రాజు, మండల ప్రధాన కార్యదర్శి ఆగరాజు మాట్లాడారు. జనగామ పట్టణ కేంద్రంలో చాకలి ఐలమ్మ విగ్రహంఏర్పాటు చేయాలని కోరారు. బడ్జెట్లో కేటాయించిన 450కోట్లు విడుదల చేయాలన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరారు. ఉచిత విద్యుత్ మీటర్లు అందరికీ అందేటట్లు చూడాలని కోరారు. ప్రతి గ్రామంలో ధోభీ ఘాట్స్ నిర్మించి కమిటీ హాల్స్ ఏర్పాటు చేయాలన్నారు. నూతన నియామకాల్లో భాగంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా లోకుంట్ల ఆగరాజు, జిల్లా మహిళా అధ్యక్షురాలుగా లక్ష్మి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా వడ్యానం బాలు,జిల్లా ముఖ్య సలహాదారులుగా మంథెన కిష్టయ్య, జిల్లా మీడియా సెక్రెటరీగా ఉళ్లెంగుల సాయి కుమార్, తోపాటు జిల్లా కార్యవర్గ సభ్యుల్ని నియమించి నియామక పత్రాలు అందజేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సాంబరాజు రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి కొలిపాక రాములు, గ్రామ అధ్యక్షులు భద్రం, గ్రామ అధ్యక్షులు శ్రీను, బిక్షపతి , తదితరులు పాల్గొన్నారు.