Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-రాయపర్తి
నెలసరి జీతం ఘనంగా తీసుకుంటూ విద్యార్థులు లేని పాఠశాలలో విధులు నిర్వ హిస్తూ కాలం వెళ్లదీస్తున్న విషయంపై నవ తెలంగాణ దినపత్రికలో 'జీతం ఘనం... బోధన శూన్యం' అనే కథనాన్ని ఇటీవల ప్రచు రించగా మంగళవారం జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి స్పందించారు. కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు రావుల భాస్కర్‌రావుకు విచారణ చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. దీంతో రావులతండా ప్రైమరీ పాఠశాలను ఆయన సందర్శించి క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. విద్యార్థుల రిజిస్టర్లను పరిశీలించారు. విద్యార్థుల హాజరు శాతం తగ్గడం గురించి తెలుసుకున్నారు. అనంతరం భాస్కర్‌రావుకు డీఈఓ వీడియో కాల్ చేసి పాఠశాల పరిసరాలను పరిశీ లించారు. కాగా బాధిత ఉపాధ్యాయుడు లిఖిత పూర్వకంగా వివరాలిచ్చారని, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు చేరవేసినట్టు భాస్కర్కరావు తెలిపారు.