Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ జయశంకర్-భూపాలపల్లిలో ప్రారంభమైన వరి కోతలు
అ ఆందోళనలో అన్నదాతలు
నవతెలంగాణ-భూపాలపల్లి
జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో వానకాలం వరి పంట కోతలు గత రెండు రోజులుగా ప్రారంభ మయ్యాయి. జిల్లావ్యాప్తంగా 1,69,90 ఎకరాల్లో రైతులు వరి పంటలు వేశారు. తద్వారా 1,65,000 టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంచనా వేశారు. భూపాలపల్లి మండల వ్యాప్తంగా 14 వేల243, చిట్యాల 8వేల72, గణపురం పదివేల 296, మొగుళ్లపల్లి 8వేల296, రేగొండ 11, 288, టేకుమట్ల 7, 717, కాటారం 12,922, మహాదేవపూర్ 4,930 మల్హర్ రావు 15,942, మహా ముత్తారం 12,059 పలిమెల 1319 ఎకరాల్లో వరి పంట వేశారు. ఏటా జయశంకర్-భూపాలపల్లి జిల్లాలో మొదటగా మల్హర్రావు మండలంలోని పంటలు ప్రారంభమై వరి కోతలు సైతం ఈ మండలం నుంచి ముందస్తుగా ప్రారంభమవుతాయి. రెండవ మండలం టేకుమట్ల ఉంటుంది. ఇక్కడ కూడా ముందుగా వేసి కోతలు కూడా ముందుగా ప్రారంభిస్తారు. ఇప్పుడు కూడా ఈ మండలాల నుండే వరి కోతలు ప్రారంభం కావడంతోపాటు భూపాలపల్లి మండలం వ్యాప్తంగా వరి కోతలు ఊపందుకున్నాయి. వాతావరణ మార్పుల దృష్ట్యా రైతులు తమ పంట కోయడానికి హార్వెస్టర్ ఆశ్రయిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి హార్వెస్టర్ల అద్దె ధరలు అమాంతం పెరిగాయని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది సాధారణ వరి కోత యంత్రా లు గంటకు రూ.1800 ఉండగా చైన్ సహాయంతో నడిచే వరికోత యంత్రాలు గంటకు రూ.2500 ఉండగా ఈసారి సాధారణ యంత్రానికి గంటకు రూ.2,200 ఉండగా చైన్సాయంతో నడిచే యంత్రా లు గంటకు రూ.3500 పెంచి వసూలు చేస్తున్నారు.
పంట కోయడానికి కూలీల కొరత అధికంగా ఉండడంతో రైతులు గత్యంతరం లేని పరిస్థితుల్లో యజమానులు అన్నంత ధర చెల్లించి హార్వెస్టర్లతో పంట కోయడానికి సిద్ధమవుతున్నారు. అయితే హార్వెస్టర్ ల తో పశుగ్రాసానికి తీవ్ర ఇబ్బం దులు ఎదురవుతున్నాయని, కానీ, అను కూలించని వాతావరణం కూలీల కొరతతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు హార్వెస్టర్ ఆశ్రయించాల్సి వస్తుందని వాపోతున్నారు. అయితే పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తమ పాలిట శాపంగా మారాయని దీంతో హార్వెస్టర్ యజమానులు ప్రజలు విపరీతంగా పెంచారని అన్నదాతలు వాపోతున్నారు