Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి
నవతెలంగాణ-నర్సంపేట
నియోజవర్గ ప్రజలందరికి అందుబాటులో అధునాతన మెరుగైన చికిత్స అందిం చడానికి 250 పడకల జిల్లా ఆస్పత్రిని నిర్మించబోతున్నామని ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎంసహాయనిధి లబ్ధిదారులు 80 మందికికి మంజూరైన రూ.30లక్షల విలుజేసే చెక్కులను ఎమ్మెల్యే అందజేసి మాట్లాడారు. రూ.66.36కోట్లతో 250 పడకల ఆస్పత్రిని నిర్మించడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, మరో రెండేండ్లలో ఆస్పత్రిని అందుబాటులోకొస్తుందన్నారు. కార్పొరేట్ ఆస్పత్రి స్థాయిలో చికిత్స అందుతుందని చెప్పారు. ప్రమాదాల బారిన వారికి అత్యవసర చికిత్స కూడా అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ మండలలాల ఎంపీపీలు మోతె కలమ్మ పద్మనాభరెడ్డి, ఊడ్గుల సునిత ప్రవీణ్, చెన్నారావుపేట మాజీ జెడ్పీటీసీ జున్నుతుల రాంరెడ్డి, దుగ్గొండి మండల నాయకులు సుకునె రాజేశ్వరావు, భద్రయ్య, కౌన్సిలర్ నాగిశెట్టి పద్మ ప్రసాద్, నెక్కొండ పీఏసీఎస్ చైర్మన్ మారం రాము, గందె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.