Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్
నవతెలంగాణ-భూపాలపల్లి
సోసైటీల్లో 80శాతం సొసైటీలు ముదిరాజ్‌లవే ఉన్నాయని, చేపలు పట్టే పూర్తి హక్కులు ముదిరాజులకే కల్పించాలని ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు ఆకుల సుభాష్ కోరారు. మంగళవారం జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావుల జగదీశ్వర ప్రసాద్ ఆదేశాల మేరకు కార్యకర్తల సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. ముదిరాజ్ డిమాండ్ల సాధనకు ప్రతి జిల్లా నుండి పాదయాత్రగా బయిలుదేరి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే మరో సింహ గర్జన శాసనమండలి ఎన్నికల కోడ్ నేపథ్యంలో వాయిదా వేసినట్టు తెలిపారు. ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీఏలోకి మార్చాలని, 18ఏండ్లు నిండిన ప్రతి ముదిరాజ్‌కు మత్స్య సహకార సంఘాల్లో సభ్యత్వం ఇవ్వాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో ముదిరాజ్ కమ్యూనిటీ భవనాలకు రెండెకరాల భూమి, రూ.2కోట్ల నిధులు కేటాయించాలన్నారు. జనాభా దామాషా ప్రకారం అసెంబ్లీ, పార్లమెంట్, శాసన మండలి, స్థానిక ఎన్నికల్లో ముదిరాజ్‌లకు సీట్లు కేటాయించాలన్నారు. 68లక్షల జనాభా ఉన్న ముదిరాజ్‌లకు ముదిరాజ్ పైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. భూపాలపల్లి పట్టణ అధ్యక్షులు ఆకుల సాంబయ్య, ముదిరాజ్ సంఘం భూపాలపల్లి అధ్యక్షులు వెంగల ఆంజనేయలు, ఉపాధ్యక్షులు మల్లయ్య, సొసైటీ అధ్యక్షులు యాదగిరి, జిల్లా ఉపాధ్యక్షులు డబ్బేట నాగేష్, తదితరులు పాల్గొన్నారు