Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అ పేరుకుపోతున్న ధాన్యం నిల్వలు
అ టోకెన్ల పద్ధతిలో రైతులకు టోకరా
అ కనీస సౌకర్యాలు కరువు
అ అకాల వర్షాలతో రైతన్న గుబులు
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
పక్క ఫొటోలో కనిపిస్తున్న రైతు భూక్య శ్రీనుది స్టేషన్‌ఘన్‌పూర్ పరిధి విశ్వనాథపూర్ శివారు మాన్సింగ్తండ. తనకున్న నాలుగు ఎకరాల్లో వరి పండించాడు. దసరా పండుగకు ముందే వరి కోసి కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చాడు. నేటికీ నెల రోజులు దాటిపోతోంది. రోజూ వడ్లు ఆరబోసి మళ్ళీ నూర్చి, పరదాలు కప్పి పోతున్నాడు. పరదాల కిరాయి ఒక్కదానికి ఒక్కరోజు రూ.30 చొప్పున 10 పరదాలు తీసుకొచ్చాడు. రోజుకు రూ.300కిరాయి భారం పడుతోంది. ధాన్యం కొనమంటే లాటరీ పద్ధతిన టోకెన్లు తీసి కొంటున్నారు. కాగా తమకంటే వెనక వచ్చినవారివి కొంటున్నారని భూక్య శ్రీను వాపోతున్నాడు. నష్టాలపాలవ్వక ముందే త్వరితగతిన ధాన్యం కొనుగోలు చేయాలని వేడుకుంటున్నాడు. ఇది ఒక్క రైతు పరిస్థితే కాదు. స్టేషన్‌ఘన్‌పూర్, చిల్పూర్ మండల రైతులదీఇదే పరిస్థితి.