Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బచనపేట : బచ్చన్నపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిడిగొండ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తహశీల్దార్ కు వినతిపత్రం ఇచ్చారు. మండలంలో నిల్వ ఉన్న ధాన్యాన్ని మరియు చివరి గింజ వరకు కొనుగోలు చేయాలని, కోరారు. కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గంగం బుచ్చిరెడ్డి, పట్టణ ఉపాధ్యక్షుడు రాజయ్య,పట్టణ అధ్యక్షుడు మహత్మాచారి, బాలకిషన్ గౌడ్, యెల్లయ్య పాల్గొన్నారు.
నర్సంపేట : వరి ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కాంగ్రేస్ పట్టణా ధ్యక్షులు పెండెం రామానంద్, మండలాధ్యక్షులు భానోతు లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలో ధర్నా చేపట్టారు. మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు పార్వతమ్మ, కౌన్సిలర్ విజరు కుమార్, ముగ్దుంపురం ఎంపీటీసీ చీకటి స్వరూప ఓదయ్య, మాజీ వార్డు మెంబర్ రమేష్, నియో జకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సందీప్ పాల్గొన్నారు.
నల్లబెల్లి : ధాన్యం కొనుగోలు చేయాలని మండల కేంద్రంలో ధర్నా నిర్వహించి స్థానిక తహసిల్దార్‌కు వినతి పత్రాన్ని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు చిట్యాల తిరుపతి రెడ్డి అందజేశారు. జిల్లా కార్యదర్శి మాలోత్ రమేష్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ చరణ్ సింగ్, అశోక్, నర్సంపేట బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చర్ల శివారెడ్డి, అంజలి మోహన్, కొమురా రెడ్డి పాల్గొన్నారు.