Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గీసుకొండ
మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగాయని, వీటిని అరికట్టేందుకు ఉద్యమించాలని సామాజిక ఉద్యమ నేత భాగవతుల రమాదేవి పిలుపునిచ్చారు. బుధవారం ఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమాఖ్య రాష్ట్ర స్థాయి శిక్షణా తరగతులు మండలంలో రెండో రోజు కొనసాగాయి. సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి వంగల రాగసుధతో కలిసి రమాదేవి మాట్లాడారు. దేశంలో మతోన్మాద బీజేపీ మహిళల హక్కులను చట్టాలను పకడ్బందీగా అమలుజేయడంలో విఫలమమైందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా మహిళల పట్ల వివక్ష చూపుతోందన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వస్కుల సైదమ్మ, కుంభం సుకన్య రాష్ట్ర నాయకులు అంగడి పుష్ప, సుల్తానా లావణ్య, ఎంసిపిఐ(యు) జిల్లా కార్యదర్శి గోనె కుమారస్వామి పాల్గొన్నారు.