Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చిల్పూర్
హనుమకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో చిల్పూర్ మండలం లోని మల్కాపూర్ గ్రామానికి చెందిన ఎంపిటిసి మునిపల్లి సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నుండి టిఆర్ఎస లో చేరారు. ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సమక్షంలో మునిపల్లె సుధాకర్‌కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్న ప్రజా రైతు సంక్షేమ కార్యక్రమాలు చూస టీిఆర్‌ఎస్‌లో చేరామన్నారు. ఎంపీపీ భూమి శెట్టి సరిత-బాలరాజు, చిల్పూర్ గుట్ట దేవస్థానం చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు రవీందర్ పాల్గొన్నారు.