Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
ధాన్యం కొనుగోలులో ప్రభుత్వాలవి నాటకాలని మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం కళ్లాల్లో కాంగ్రెస్' కార్యక్రమంలో భాగంగా మండలం లో తహసిల్దార్ కార్యాలయం ముందు నిరసన తెలిపి తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండానిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్పుకునే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నడ్డి విరుస్తున్నాయన్నారు. రైతులు పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలన్నారు. వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాల, కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. మిల్లర్ల తో సంబంధం లేకుండా ధాన్యం రసీదు ఇవ్వాలని అన్నారు. తరుగు పేరట రైతులను దోచుకుంటే ఊరుకోమన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని మార్కెట్లకు తీసుకొచ్చిన తరువాత కొనుగోలు చేసే దాకా ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అయిత ప్రకాష్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న, డిసిసి ఉపాధ్యక్షులు గద్దె సమ్మిరెడ్డి, ఎంపీపీ సమ్మయ్య, ఎంపీటీసీ జాడి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.