Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాటారం
రైతు పండించిన పంటను కొనుగోలు చేయాలని బీఎస్పీ మంథని నియోజకవర్గ అధ్యక్షులు రామిళ్ళ రాకేష్ అన్నారు. మండల కేంద్రంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం వడ్లను వెంటనే గిట్టుబాటు ధరకు కొనుగోలు చేయాలన్నారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు బాయిల్డ్ రైస్, రా రైస్ అంటూ ఒకరి మీద ఒకరు నెట్టివేసుకుంటూ రైతన్నను అగాధంలోకి నెడుతున్నారని అన్నారు. రైతు అల్లాడుతుంటే ప్రజాప్రతినిధులు మాత్రం ఎన్నికల మిద పెట్టె శ్రద్ధ రైతు పంట కొనుగోలు పై పెట్టట్లేదన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కాటారం సెక్టార్ అధ్యక్షులు బొడ్డు రాజబాబు, మహా ముత్తారం సెక్టార్ అధ్యక్షులు రామగిరి రాజు,పలిమెల సెక్టార్ అధ్యక్షులు కల్లూరి వెంకట్, బీవీఎఫ్ మండల కన్వీనర్ మట్టి సత్యం ఉన్నారు