Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎంపీపీ కందగట్ల కళావతి,జడ్పిటీసి గూడ సుదర్శన్ రెడ్డి
నవతెలంగాణ-సంగెం
రైతులు ప్రభుత్వ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ కందగట్ల కళావతి, జడ్పిటీసి గూడ సుదర్శన్ రెడ్డి అన్నారు. బుధవారం కాళోజీ మాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో తీగరాజుపల్లి గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని వారు ప్రారంభించి మాటాడారు. ధాన్యాన్ని దళారులకు అమ్మి,మోస పోవద్దన్నారు. సర్పంచ్ కరుజుగుత్త రమాగోపాల్, ఏవో యాకయ్య, ఎంపిడిఓ మల్లేశం,రైతు బందు అధ్యక్షుడు కందగట్ల నరహరి, ఎనుమాముల మార్కెట్ డైరెక్టర్ పసునూరి సారంగపాణి, వైస్‌ఎంపీపీ బుక్క మల్లయ్య, పీఏసీఎస్ ఛైర్మెన్ వేల్పుల కుమారస్వామి యాదవ్, సొమ్లతండా సర్పంచ్ మంగ్యా నాయక్, ఎంపీటీసీ రంగరాజు నరసింహస్వామి, మాజీ ఎంపిపి సోల్లేటి వీరచారి, ఉప సర్పంచ్ సోలగుడి రఘు, ఏ ఈ ఓ సంధ్య, రైతు సమన్వయ కమిటీ కోఆర్డినేటర్ హింగేచిరంజీవి పాల్గొన్నారు.