Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రతిభను కనబర్చితేనే భవిష్యత్తు ఉంటుందని ఎన్ఐటీ ప్రొఫెసర్ పీ హరికృష్ణ అన్నారు. బుధవారం బిట్స్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం ప్రవేశ విద్యార్థులకు నిర్వహించిన ఓరియేంటేషన్ ప్రోగ్రామ్‌లో ఆయన మాట్లాడారు. బాలాజీ విద్యా సంస్థలు అందిస్తున్న ప్రోత్సాహాం, టెక్నికల్ నాలెడ్జ్‌తో ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయికి ఎదుగడానికి ఎంతగానో కృషి చేస్తుండడం అభినందనీ యమన్నారు. బిట్స్ కళాశాల ప్రిన్సిపాల్ వీఎస్.హరిహరన్ మాట్లాడుతూ ఎందరో మంది విద్యార్థులను తీర్చిదిద్ధి అత్యన్నోత స్థాయికి తీసుకెళ్లిన బాలాజీ విద్యా సంస్థ అటానమస స్థాయికి చేరడం గర్వకారణమన్నారు. బాలాజీ విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ జీ.రాజేశ్వర్ రెడ్డి, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ విభాగాధిపతి వీ.విక్రమ్ రెడ్డి, అకాడమిక్ కోఆర్డినేటర్ వీ.నారాయణ, ఏవో ఎస్.సురేష్, కళాశాల ప్రిన్సిపాల్ ఎల్.సంపత్ పాల్గొన్నారు.