Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నర్సంపేట
అనుమానస్పద స్థితిలో ఆర్టీసీ కండక్టర్ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటనబుధవారం చోటుచేసుకొంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం పట్టణంలోని పోచమ్మ గుడి ప్రాంతానికి చెందిన ఎండీ.ఇమ్రాన్(31) ఆర్టీసీలో కారుణ్య నియామకం ద్వారా కండక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. కొద్ది రోజులుగా ఆర్టీసీ అధికారులు ఇమ్రాన్‌కు ఆర్ఎం కార్యాలయంలో అకౌంట్ సెక్షన్లో విధులను అప్పగించారు. అక్కడ విధులను నిర్వర్తిస్తూ వచ్చిన ఇమ్రాన్ మంగళవారం అర్థరాత్రి ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలన్మరణం చెందాడు. ఇమ్రాన్ తల్లి చోటీ ఓ ఫంక్షన్‌కు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకొంది. గడియపెట్టిన తలుపులను బాధినా తెరువలేదు. అనుమానం వచ్చి చుట్టు పక్కల వారి సహాయంతో తలుపుల గడియ తీసేసరికి ఫ్యాన్‌కు ఇమ్రాన్ మృతదేహం వేలాడుతూ కన్పించింది. సంఘటనపై మృతుడి తల్లి చోటి ఫిర్యాదు మేరకు అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామ్‌చరణ్ తెలిపారు.