Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నడికూడ
రాయపర్తి ప్రజలు గ్రామంలోని డ్రెయినేజీ సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గురువారం ఆయన ఆ గ్రామంలోని డ్రెయినేజీ సమస్యను పరిశీలించి మాట్లాడారు. గ్రామంలోని డ్రెయినేజీ వ్యవస్థ పూర్తిస్థాయిలో లెవెల్స్ వేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సంబందిత అధికారులకు ఆదేశించారు.
ఎవరికి ఇబ్బంది కలగకుండా, నష్టం వాటిల్లకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. గ్రామస్థులంతా అభివద్ధి పనులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రావుల సరిత రాజిరెడ్డి, ఎంపీపీ మచ్చా అనసూర్య రవీందర్, జెడ్పీటీసీ కొడపాక సుమలత కరుణాకర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి గణపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.