Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని తాహారాపూర్లో శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం ఎదుట నిమ్మల కుమార్ ఇంటి వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం గాలికి ఊగిసలాడుతుంది. ఈ విషయంపై విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వగా, నెల రోజుల క్రితం స్టే వైర్‌కు బదులుగా తాత్కాలికంగా తాడుతో బిగించారు. నెల రోజులు గడుస్తున్న అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. కోతులు గెంతుతుండడంతో విద్యుత్ స్తంభం ఊగిసలాడుతుందని, దీంతో భయాందోళనకు గురి కావాల్సి వస్తుందని, స్తంభం నేల వాలితే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి విద్యుత్ స్తంభానికి స్టే వైరు ఏర్పాటు చేయాలన్నారు. లేకుంటే విద్యుత్ స్తంభం తొలగించి ఎలాంటి ప్రమాదం జరగకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.