Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువతకు అవకాశాలు కల్పించాలి
కలెక్టర్ కృష్ణ ఆదిత్య
నవతెలంగాణ - ములుగు
జిల్లాలో ఉపాధి పనులను ప్రజలకు చేరువ చేయాలని కలెక్టర్ కష్ణ ఆదిత్య ఎంపీడీఓలను ఆదేశించారు. గురువారం జాకారం సమీపంలోని డీఆర్డీఓ కార్యాలయంలో ఉపాధి హామీ పథకం గురించి ఎంపీడీఓలకు, ఎంపీఓలకు నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధి హామి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. జన సంచారం అధికంగా ఉన్న ప్రదేశాల్లో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణం చేపట్టి, త్వరితగతిన పూర్తి చేయలన్నారు. ఇంకుడు గుంతల నిర్మాణాలపై అధికారుల పని తీరు సరిగా లేదని కలెక్టర్ అసహానం వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో 5 నుండి 10 పాయింట్ సెలెక్ట్ చేసి వార్డుల వారీగా వ్యక్తిగత, ఉమ్మడిగా అవసరాన్ని బట్టి నిర్మాణం చేపట్టుటకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జెనరేషన్ ప్రోగ్రాంలో 35 శాతం సబ్సిడీ ఉంటుందని, 25లక్షల రుణం మంజూరనకు అవకాశం ఉంటుందన్నారు. యువతకు అవగాహన కల్పించి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటకులకు అవసరాల నిమిత్తం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం అవసరమన్నారు. గ్రామాలు, వార్డుల వారీగా ఉత్సాహవంతులైన వారిని గుర్తించి పాస్ట్ ఫుడ్ సెంటర్, ఐస్ క్రీమ్ పార్లర్ ఆ ప్రాంతానికి ఏది అవసరమో అది గుర్తించి మోటివేషన్ చేయవలసిన బాధ్యత ఎంపీఓలపై ఉందన్నారు. బోగత, లక్నవరం, రామప్ప, వాజేడు, మల్లూరు లాంటి పర్యాటక ప్రదేశాల్లో ఐస్ క్రీమ్ పార్లర్, పాస్ట్ పుడ్ సెంటర్స్ లాంటివి ఏర్పాటు చేస్తే బాగుంటుందన్నారు. ఈ విషయంపై ప్రణాళికలు సిద్ధం చేసి అమలయ్యే విధంగా చూడాలని అన్నారు. మేడారం జాతర సందర్భంగా ప్రభుత్వ భూమిలో గానీ, వ్యక్తిగత స్థలంలో కానీ నిబంధనల మేరకు మడిగలను(షాపులను) ఏర్పాటు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలలన్నారు. స్థానికులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందన్నారు. ఉత్సాహవంతులైన నిరుద్యోగ యువత ముందుకు వచ్చినట్లయితే 2-25లక్షల వరకు బ్యాంక్ రుణం ఇస్తుందని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, డీఆర్డీఓ నాగ పద్మజ, ఏపీడీఎం వెంకట నారాయణ, సంబందిత మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు తదితరులు పాల్గొన్నారు.