Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అడ్డుకున్న పాత మార్కెట్ వాసులు
నవతెలంగాణ-వెంకటాపురం
జనావాసాల్లో మద్యం దుకాణం ఏర్పాటు చేయద్దంటూ పాత మార్కెట్ ప్రజలు మద్యం దుకాణం ఎదుట బుధవారం బైఠాయించారు. నిన్నటితో మద్యం దుకాణాల గడువు ముగిసింది. నూతన మద్యం దుకాణాన్ని దక్కించుకున్న దుకాణదారులు పాత మార్కెట్ సమీపంలో మద్యం దుకాణ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. నివాస గహాలకు సమీపంలో మద్యం దుకాణాన్ని నిర్వహిస్తే నివాస ప్రజలు ఇబ్బందులు పడతారని, మధ్యం బాబులతో ఇబ్బందులు పడాల్సి ఉంటుందని మద్యం దుకాణ ఏర్పాటును అడ్డుకున్నారు. సంఘటనా ప్రాంతానికి చేరుకున్న ఏఎస్సై రామచంద్రునాయక్ గ్రామస్తులకు నచ్చచేప్పే ప్రయత్నం చేశారు. నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేస్తే మందుబాబులతో ఇబ్బందులు పడాల్సి వస్తుందని, ఈ దారి గుండానే డిగ్రీ, హైస్కూల్ విద్యార్థులు వెళ్తారని, కూత వేటు దూరంలోనే పోలీస్స్టేషన్ ఉందని మద్యం దుకాణాన్ని నిలిపేయాలని పట్టు బట్టారు. దీంతో ఉన్నతాధికారుల సూచన మేరకు తాత్కాలికంగా బుధవారం మద్యం దుకణ ఏర్పాటును నిలిపేశారు. కార్యక్రమంలో సర్పంచ్ చిడెం యామిలీ, ఎంపీటీసీ కొండపర్తి సీతాదేవి, పాల మార్కెట్ మహిళలు పాల్గొన్నారు.