Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గూడూరు
మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జెడ్పీ కోఆప్షన్ సభ్యుడు కాసీమ్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల ఆవరణను పరిశీలించారు. వంటశాలను, తరగతి గదులను సందర్శించి పదో తరగతి విద్యార్థులతో మాట్లాడారు. ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి శాతం సాధించాలని కోరారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ మేడ వసంత, తదితరులు పాల్గొన్నారు.