Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మరిపెడ
సీపీఐ(ఎం) నాయకుడిగా ప్రజలకు, కార్మికులకు అండ గా నిలిచి సమరశీల పోరాటాలు నిర్మించిన భయ్యా వెంకన్న స్ఫూర్తిని కొనసాగించాలని ఆ పార్టీ మండల కార్యదర్శి దుండి వీరన్న కోరారు. మండలంలోని గుండెపూడిలో గుండగాని మధుసూదన్ అధ్యక్షతన వెంకన్న ప్రధమ వర్ధంతి సభ మంగళవారం రాత్రి నిర్వహించారు. తలొఉత బస్టాండ్ సెంటర్ నుంచి భయ్యా వెంకన్న స్తూపం వరకు కొవ్వొత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వెంకన్న చిత్రపటానికి అతడి సతీమణి ప్రేమల, కుటుంబీ కులు, పార్టీ నాయకులు పుష్పాంజలి ఘటించారు. అనం తరం జరిగిన సభలో దుండి వీరన్న మాట్లాడారు. గుండె పూడి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల బిల్లుల్లో, పలు ప్రభుత్వ సంక్షేమ పథకాలలో జరిగిన అవినీతి అక్రమాలపై క్రియా శీలకంగా పోరాడారని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు జరుగుతున్న అన్యాయంపై అధికారు లను నిలదీసినట్టు తెలిపారు. నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారం కోసం కృషి చేశాడని చెప్పారు. వెంకన్న మృతి బాధాకరమన్నారు. వెంకన్న ఆశయాల సాధన కోసం ఉద్యమాలు నిర్మిస్తామన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు కందాల రమేష్, గంధసిరి పుల్లయ్య, గంధ సిరి ప్రియాంక, మండల కోఆప్షన్ సభ్యులు అల్లి శ్రీనివాస్ రెడ్డి, గ్రామ శాఖ కార్యదర్శి షరీఫ్, గుండగాని మధుసూదన్, భవన నిర్మాణ కార్మిక సంఘం మండల సహాయ కార్యదర్శి ఇమామ్ సాబ్, రేఖ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.